ePaper
More
    HomeతెలంగాణCollector Nizamabad | రెండు మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    Collector Nizamabad | రెండు మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    Published on

    అక్షరటుడే ఇందల్వాయి : Collector Nizamabad | ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ధర్పల్లి మండలం ఒన్నాజిపేట్​లోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్​వాడీ సెంటర్, ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు.

    ఇందల్వాయి మండలంలోని (Indalvai mandalam) ఎల్లారెడ్డిపల్లిలో ఉన్న అంగన్​వాడీ కేంద్రాలను, సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరును పేస్ రికగ్నేషన్ విధానం (Face Recognisation System) ద్వారా చేపడుతున్నారా అని ఆరా తీశారు. విద్యార్థుల ప్రవేశాలు, హాజరవుతున్న వారి సంఖ్యను కలెక్టర్​ ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఎరువుల గిడ్డంగుల్లో అందుబాటులో ఉన్న నిల్వలు స్టాక్ రిజిస్టర్​లోని వివరాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు.

    READ ALSO  Banswada Sub collector | భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి

    Collector Nizamabad | ఎరువులను అందుబాటులో ఉంచాలి

    రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. ఎరువుల వివరాలతో కూడిన స్టాక్​బోర్డులను (Stockboard) ప్రతిచోటా తప్పనిసరిగా ప్రదర్శించాలని, శాశ్వత ప్రాతిపదికన బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నందున, ఎక్కడ కూడా ఎరువుల కోసం రైతులు (Farmers) ఇబ్బందులు పడకుండా ప్రణాళికాబద్ధంగా పంపిణీ జరిగేలా కృషి చేయాలని చెప్పారు.

    Collector Nizamabad | ఒకేచోట అంగన్​వాడీల నిర్వహణపై ఆరా..

    ఎల్లారెడ్డిపల్లిలో (Yellareddypally) ఒకే ప్రాంగణంలో మూడు అంగన్​వాడీ కేంద్రాలు (Anganwadi Centers) కొనసాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్.. ఎందుకు ఒకేచోట నిర్వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. గదులు ఒకేచోట అందుబాటులో ఉన్నందున ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ, ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్​వాడీ టీచర్ రజితను ఆదేశించారు. ఎల్లారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

    READ ALSO  Weather Updates | నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...