అక్షరటుడే, కామారెడ్డి: Yoga tournament | పట్టణంలో జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ (Yogasana Sports Association) ఆధ్వర్యంలో అస్మిత యోగా సిటీ లీగ్ (Asmita Yoga City League) పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి శనివారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) పోస్టర్లను ఆవిష్కరించారు.
అనంతరం యోగా అసోసియేషన్ అధ్యక్షుడు యోగా రాంరెడ్డి మాట్లాడుతూ.. యోగాసన పోటీలు ఆగస్టు 4న యోగా భవన్లో నిర్వహిస్తున్నామన్నారు. యోగా సాధకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పోటీల్లో ఎంపికైన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు అర్హులు అవుతారని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో రాణించిన యోగా సాధకులకు భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా ఉజ్వలమైన అవకాశాలు లభిస్తాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా పట్ల సానుకూలమైన దృక్పథం ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో గరిపల్లి అంజయ్య గుప్తా, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రెటరీ బాస రఘుకుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బద్దం అనిల్ రెడ్డి, శ్రీలత, హిమబిందు, రాజ్ కుమార్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.