అక్షరటుడే, బాన్సువాడ: Birkoor mandal | దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఇళ్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (joint Nizamabad district) తరచూ దొంగతనం ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల సిరికొండ మండలంలో గడ్కోల్లో (Gadkol village) పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన విషయం తెలిసిందే.
తాజాగా.. బీర్కూర్ మండల (Birkur mandal) కేంద్రంలో తాళాలు వేసిన రెండు ఇళ్లలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు సాయవ్వ, విజయలక్ష్మి ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లారు. తాళాలు వేసిన ఇళ్లను గమనించిన దుండగులు దొంగతనానికి పాల్పడే సమయంలో పక్క ఇళ్లకు బయట నుంచి గొల్లాలు పెట్టి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. సాయవ్వ ఇంట్లో రూ. రెండు వేలు, విజయలక్ష్మి ఇంట్లో రూ. 20 వేలు దొంగతనం జరిగినట్లు ఎస్సై రాజశేఖర్ (SI Rajasekhar) తెలిపారు. ఒకే రోజు రెండిళ్లలో చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.