Municipal Corporation
Municipal Corporation | క్రమం తప్పకుండా చెత్తను సేకరిస్తున్నాం..

అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | నగరంలోని అన్ని సర్కిళ్ల పరిధిలో నిత్యం చెత్త సేకరణ కొనసాగుతోందని కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dilip Kumar) తెలిపారు. రెండు రోజుల క్రితం ‘అక్షరటుడే’లో ‘చెత్త బండి..రోజూ రాదండి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు. అన్ని కాలనీల్లో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తామని చెప్పారు. నిత్యం చెత్త సేకరణను అధికారులు పర్యవేక్షిస్తున్నారని ఆయన వివరించారు. ఎక్కడా ఎలాంటి సమస్య ఉన్నా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.