అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Sudarshan reddy | ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో (Congress Bhavan) శనివారం కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌కు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి (District Library Chairman Anti Reddy Rajireddy) కేక్ తినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ (State Cooperative Union) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్ కేశవేణు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, రత్నాకర్ యూత్ కాంగ్రెస్ విపుల్ గౌడ్, ఓబీసీ నరేందర్ గౌడ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.