అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kohli Hair Cut | రన్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా తన అభిమానులని ఏదో విధంగా అలరిస్తుంటాడు. ఒక్కోసారి డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో (Different Hair Style) మెరుస్తూ ఆకట్టుకుంటుంటాడు. అయితే కోహ్లీకి స్పెషల్ హెయిర్ కట్ చేసేది మరెవరో కాదు ఆలిమ్ హకీం. బాలీవుడ్ స్టార్లు, క్రికెట్ లెజెండ్స్‌కు ట్రెండీ హెయిర్‌కట్స్ (Trendy Haircuts) చేస్తూ వార్తలలో నిలుస్తుంటాడు హకీం. తాజాగా ఆయన తన ఛార్జీల వివరాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయాలు సోషల్ మీడియాలో దూసుకుపోతుండగా, ఆయన తీసుకునే ఫీజు విని నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Kohli Hair Cut | అంత ధరనా..?
విరాట్ కోహ్లీ (Virat Kohli), రణ్‌బీర్ కపూర్, హార్దిక్ పాండ్యా, ఎం.ఎస్. ధోనీ, రణ్‌వీర్ సింగ్ వంటి స్టార్‌లకు హెయిర్‌కట్ చేయాలంటే, ఒక్క సెషన్‌కి ఆయన రూ. లక్ష ఛార్జ్ చేస్తారు. దీనికి జీఎస్టీ కలిపితే మొత్తం రూ. 1,18,000 అవుతుందట. వాళ్లు సినిమాల ద్వారా కోట్లు రాబడతారు. అలాంటప్పుడు నా సేవలకూ తగినంత ధర వసూలు చేయడంలో తప్పేం లేదు. ఇది కేవలం హెయిర్‌కట్ కాదు, ఒక ప్రొఫెషనల్ కన్సల్టేషన్,” అని ఆలిమ్ వ్యాఖ్యానించారు. ఒక సినిమాలో నటుడి పాత్రకు సరిపోయేలా హెయిర్‌స్టైల్‌ను మెయింటైన్ చేయాలంటే 10–15 సెషన్లు అవసరం అవుతాయని ఆలిమ్ తెలిపారు. దీంతో ఖర్చు రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు పెరుగుతుందట.
ఇది టాక్సీలో మీటర్ వేసినట్లు. క్లయింట్ కోరితేనే నేను చేస్తాను. కానీ తెరపై కనిపించే అవుట్‌పుట్‌కి మా సేవలు విలువైనవే అని అన్నారు. ఇలాంటి భారీ ఛార్జీలు ఆయన వ్యక్తిగతంగా చేసే సెషన్లకి మాత్రమే. ఆలిమ్ హకీం(Alim Hakim) నడిపించే సెలూన్లలో మాత్రం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. నా సెలూన్‌లో హెయిర్‌కట్ ధరలు రూ. 2,500 నుంచి మొదలవుతాయి. ప్రతీ కస్టమర్‌కి నేను స్వయంగా చేయలేను. మనీష్ మల్హోత్రా కూడా అందరికి డిజైన్ చేయరు కదా!” అని చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీకి ఆలిమ్ చేసిన ఫేడ్ కట్ లుక్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. అలాగే రణ్‌బీర్ కపూర్ “యానిమల్”, ధోనీ, రణ్‌వీర్ సింగ్ లాంటి ప్రముఖుల స్టైల్స్‌కి కూడా ఆయన విశేష కీర్తి అందుకున్నారు. సెలబ్రిటీలు కెమెరా ముందు స్మార్ట్‌గా కనిపించేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడరన్న విషయం తెలిసిందే.