అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kolkata Airport | బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువకుడు కోల్‌కతా ఎయిర్‌పోర్టులో (Kolkata Airport) హల్చల్ చేశాడు. ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోని గ్లాస్ అద్దం పగులకొట్టి అక్రమంగా చొరబడడానికి యత్నించాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
బంగ్లాదేశ్‌లోని (Bangladesh) నారాయణగంజ్‌కు చెందిన మొహమ్మద్ అష్రఫుల్ సింగపూర్ నుంచి ఢాకా వెళ్తున్నాడు. కోల్‌కతాలో ల్యాండ్ అయిన నిందితుడు ఢాకాకు కనెక్టింగ్ విమానం ఎక్కాల్సి ఉంది. కానీ ఆయన అంతర్జాతీయ ట్రాన్సిట్ లాంజ్‌లో (International Transit Lounge) వేచి ఉండగా ఒక్కసారి గాజు గోడను పగులగొట్టి విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది (CISF Staff) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో అష్రఫుల్ అనేక అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశాడని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని విమానాశ్రయ పోలీసులకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్పగించారు. అతను అలా ఎందుకు చేశాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.