ePaper
More
    HomeజాతీయంRahul Gandhi | ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

    Rahul Gandhi | ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | దేశంలో ఎన్నికల నిర్వహణపై లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో జరుగుతున్న లీగల్​ కాన్​క్లేవ్​లో (Legal Conclave) శనివారం ఆయన మాట్లాడారు.

    ఈ సందర్భంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో గుజరాత్​, రాజస్థాన్​లో తమకు ఒక్క సీటు రాకపోవడం ఏమిటన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలను ఎలా క్లీన్​ స్వీప్​ చేస్తుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

    Rahul Gandhi | మా దగ్గర ఆధారాలు ఉన్నాయి..

    బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడడంపై తాము దృష్టి పెట్టామని రాహుల్​ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. మొదట తమ దగ్గర ఆధారాలు లేవన్నారు. అయితే పార్లమెంట్​ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్​ కూటమికి మంచి సీట్లు వచ్చాయన్నారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఎన్​డీఏ కూటమి విజయం సాధించిందన్నారు. దీనిపై తాము వివరాలు సేకరిస్తే సంచలన విషయాలు తెలిశాయన్నారు. పార్లమెంట్​, అసెంబ్లీ ఎన్నికల నాటికి మహారాష్ట్రలో (Maharashtra) కోటి మంది ఓటర్లు పెరిగారని ఆయన ఆరోపించారు. ఆరు నెలలుగా ఆధారాలు సేకరించి తాను మాట్లాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఫేక్​ ఓట్లతోనే బీజేపీ గెలిచిందని ఆయన ఆరోపించారు. ఈసీ తమకు ఒరిజినల్‌ ఓటర్ లిస్ట్‌ ఇవ్వలేకపోయిందని విమర్శించారు.

    READ ALSO  Trump Tariffs | ట్రంప్​ సుంకాలపై భయపడాల్సిన అవసరం లేదు.. కాంగ్రెస్​ ఎంపీ కీలక వ్యాఖ్యలు

    Rahul Gandhi | ఈసీపై ఆరోపణలు

    రాహుల్​ గాంధీ శుక్రవారం పార్లమెంట్ (Parliament)​ ఆవరణలో రాహుల్​ గాంధీ మాట్లాడుతూ ఈసీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ(BJP)కి మేలు చేయడమే లక్ష్యంగా ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. దొంగ ఓట్లను నిరూపించడానికి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయన్నారు. బీహార్​ ఓటర్​ జాబితా ముసాయిదా జాబితా విడుదలైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. రాహుల్ గాంధీ ఆరోపణలను ఈసీ కొట్టిపారేసింది. బాధ్యతారహితమైన, నిరాధార ఆరోపణలు పట్టించుకోవద్దని పేర్కొంది. పారదర్శకంగా, నిజాయితీగా విధులు నిర్వర్తించాలని అధికారులకు ఎన్నికల సంఘం సూచించింది.

    Latest articles

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త ఏం చేశాడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    More like this