అక్షరటుడే, ఇందూరు: Municipal corporation | ప్రతి ఇంట్లో, పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని డిప్యూటీ కమిషనర్ రవిబాబు (Deputy Commissioner Ravi Babu) సూచించారు. నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో (Nirmala Hrudaya School) విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ.. ఇంటి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చూడాలన్నారు. వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ప్రధానంగా ఇంటికి వచ్చే చెత్త సేకరణ వాహనాల్లో మాత్రమే వేయాలని తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని చెప్పారు.
Municipal corporation | ప్లాస్టిక్‌తో అనర్థాలెన్నో..
ప్లాస్టిక్ (Plastic Covers) వాడకంతో అనారోగ్యాలపాలయ్యే అవకాశం ఉందని డీసీ రవిబాబు సూచించారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి ప్రకృతిని కాపాడాలన్నారు. తిను పదార్థాలను కవర్లలో నిల్వ చేయద్దని సూచించారు. విద్యార్థులు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను అవగాహన కలిగించుకొని ఇతరులకు వివరించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.