అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IVF Centers | సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) అప్రమత్తమైంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై (Srishti Test Tube Center) పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఐవీఎఫ్, సరోగసీ పేరిట పేరిట మోసాలు చేస్తుండడంతో డాక్టర్ నమ్రతతో (Dr. Namrata) పాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మోసాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐవీఎఫ్ సెంటర్లపై తనిఖీలు చేయాలని ఆదేశించింది.
IVF Centers | 35 బృందాలతో తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా ఐవీఎఫ్ సెంటర్లపై (IVF Centers) వైద్యారోగ్య శాఖ అధికారులు దాడులు చేయనున్నారు. దీని కోసం 35 బృందాలను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఈ బృందాలు తనిఖీలు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. మొదట హైదరాబాద్ నగరంలో సోదాలు చేపట్టనున్నారు. అనంతరం జిల్లాల్లో దాడులు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. కాగా.. రాష్ట్రంలో మొత్తం 381 IVF సెంటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో హైదరాబాద్ నగరంలోనే 157 ఉన్నాయి. తనిఖీల కోసం 29 అంశాలతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు (Health Department Officers) లిస్ట్ రెడీ చేశారు.
IVF Centers | కొనసాగుతున్న దర్యాప్తు
‘సృష్టి’ కేసులో ఇప్పటికే పోలీసులు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం రెండో రోజును ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితులు కల్యాణి, సంతోషిని సైతం శనివారం కస్టడీకి తీసుకున్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో (Gopalapuram Police Station) నిందితులను విచారిస్తున్నారు. ఎంత మంది పిల్లలను తీసుకువచ్చి దంపతులకు సరోగసి పేరిట అప్పగించారనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.