ePaper
More
    HomeతెలంగాణKrishna River | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న వరద ఉధృతి

    Krishna River | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న వరద ఉధృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Krishna River | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది (Krishna River) పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలోని ప్రాజెక్ట్​ల నుంచి భారీగా వదర నదిలో వస్తోంది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్​లకు ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్ట్​కు ​(Jurala Project) ఎగువ నుంచి భారీగా వరద వస్తుండగా.. విద్యుత్​ ఉత్పత్తి, వరద గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.

    జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి శ్రీశైలం డ్యామ్​కు (Srisailam Dam) వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 2,70,640 క్యూసెక్కులు ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.2 అడుగులకు చేరింది. కుడి, ఎడమ గట్టు విద్యుత్​ కేంద్రాల్లో కరెంట్​ ఉత్పత్తి చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో 2,76,461 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.

    Krishna River | నాగార్జున సాగర్​ 24 గేట్ల ఎత్తివేత

    శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ ​(Nagarjuna Sagar) కళకళలాడుతోంది. ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి 2,38,629 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585.20 అడుగుల నీరు నిల్వ ఉంది. జలాశయం 24 వరద గేట్లను ఐదు అడుగుల మేర, రెండు గేట్లను పది అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి 2,56,417 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్​ కూడా నిండడంతో ప్రకాశం బ్యారేజీ మీదుగా నీరు సముద్రంలో కలుస్తుంది.

    ఎగువన గోదావరికి వరద రావడం లేదు. కాళేశ్వరం వద్ద మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు (Sriramsagar Project) ప్రస్తుతం స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​లోని ధవళేశ్వరం దగ్గర గోదావరి వరద తగ్గింది. ప్రస్తుతం 175 గేట్ల ద్వారా 3,60,400 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మంజీర నదిపై గల సింగూరు జలాశయానికి 2,901 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20.514 టీఎంసీల నీరు ఉంది. ఈ ప్రాజెక్ట్​ నిండితే.. దిగువకు నీటిని వదలనున్నారు. దీంతో నిజాంసాగర్​కు వరద వచ్చే అవకాశం ఉంది. అయితే మంజీర పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్ట్​కు ఇప్పట్లో భారీ వరద వచ్చే అవకాశం లేదు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this