అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్(Mahesh Kumar) పాదయాత్రలో పాదయాత్రలో స్వల్ప మార్పులు జరిగాయి.
తొలుత ఆలూరు మండల కేంద్రం నుంచి ఆర్మూర్ పట్టణం వరకు పాదయాత్ర చేయాల్సి ఉంది. అలాగే ఆదివారం పట్టణంలోని గురుకుల పాఠశాలలో శ్రమదాన కార్యక్రమం(Shramdana program)లో పాల్గొనాల్సి ఉంది. కాగా.. ప్రస్తుతం షెడ్యూల్లో స్వల్ప మార్పులతో ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభమై పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి, పెర్కిట్ వరకు పాదయాత్ర(Padayatra) నిర్వహించనున్నారు. రాత్రి సీ కన్వెన్షన్ హాల్(Sea Convention Hall)లో బసచేయనున్నారు. ఆదివారం ఆలూరు మండల కేంద్రంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు శ్రమదానంలో పాల్గొననున్నారు అనంతరం 10.30 గంటలకు అంకాపూర్‌లో జెండా ఆవిష్కరణ, 11 గంటలకు పీవీఆర్ యమున ఫంక్షన్ హాల్(PVR Yamuna Function Hall)లో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి తెలిపారు.