ePaper
More
    HomeజాతీయంPM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) శనివారం విడుదల చేయనున్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఏటా రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి మూడు సార్లు రూ.రెండు వేల చొప్పున కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడతల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. తాజాగా 20 విడత నిధులను ప్రధాని మోదీ జమచేయనున్నారు.

    PM Kisan | 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో..

    దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం (Central Government) నిధులు జమ చేయనుంది. మొత్తం రూ.20,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) రైతులకు రైతు భరోసా విడుదల చేసింది. తాజాగా కేంద్రం పీఎం కిసాన్​ నిధులు ఖాతాల్లో వేయనుండటంతో రైతులు ఆనంద పడుతున్నారు.

    READ ALSO  Operation Sindoor | ప్ర‌త్యేక పాఠ్యాంశంగా ఆప‌రేష‌న్ సిందూర్.. స‌న్నాహాలు చేస్తున్న ఎన్‌సీఈఆర్టీ

    PM Kisan | ఈ కేవైసీ చేసుకుంటేనే..

    పీఎం కిసాన్(PM Kisan)​ నిధులు ఈ కేవైసీ పూర్తయిన రైతులకు మాత్రమే జమ కానుంది. ఒకవేళ కేవైసీ చేసుకోకున్నా.. బ్యాంక్​ అకౌంట్​తో ఆధార్​ కార్డు లింక్​ లేకున్నా.. డబ్బులు జమ కావు. రైతులు ఆన్​లైన్​ కేవైసీ స్టాటస్​ చెక్​ చేసుకొని.. ఒకేవళ కాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.

    PM Kisan | ఇలా చెక్​ చేసుకోవాలి

    పీఎం కిసాన్​ నిధులు ఖాతాలో జమ అయ్యాయో లేదో ఆన్​లైన్​లో తెలుసుకోవచ్చు. https://pmkisan.gov.in వెబ్​సైట్​లో లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. వెబ్​సైట్​ ఓపెన్​ చేశాక.. Farmers Corner విభాగంపై క్లిక్​ చేయాలి. అనంతరం Beneficiary Status పై క్లిక్​ చేసి రైతు వివరాలు ఎంటర్​ చేస్తే డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుస్తుంది.

    READ ALSO  EPFO | పీఎఫ్​ చందాదారులకు గుడ్​న్యూస్​.. డబ్బులు తీసుకోడానికి ఇక ఆ పత్రాలు అవసరం లేదు

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this