అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Green Field Express Way | తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రానుంది. రవాణాకు కీలకమైన రాజీవ్ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా, కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం ఆమోదిస్తే, ఈ రహదారి నిర్మాణ బాధ్యతలను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) చేపడుతుంది.
Green Field Express Way | సమయం ఆదా అవుతుంది..
ఈ రహదారి ప్రారంభ బిందువు శామీర్‌పేట (Shameerpet) కాగా, మొత్తం పొడవు 205 కిలోమీటర్లు, నిర్మాణ అంచనా ఖర్చు రూ.4,000 కోట్లు. ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారి సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట, సిద్దిపేట, కరీంనగర్ మీదుగా గోదావరిఖని (Godavari Khani) వరకు వెళుతుంది. ఈ మార్గంలో మలుపులు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే, ఇప్పటికే విస్తరణకు అవకాశాలు లేకపోవడంతో కొత్త ఎక్స్‌ప్రెస్‌వే అవసరమైందని అధికారులు భావిస్తున్నారు. కొత్త రహదారి శామీర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుతో కలిసి, హుస్నాబాద్ మీదుగా సాగుతుంది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి శామీర్‌పేట వరకు హెచ్‌ఎండీఏ నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌తో ఈ మార్గం అనుసంధానమవుతుంది.
అదనంగా, నాగ్‌పూర్-విజయవాడ మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు (Green Field Express Way) ఈ కొత్త మార్గాన్ని కలిపే ప్రణాళిక కూడా ఉంది. ఇది మంచిర్యాల, ఖమ్మం జిల్లాల మీదుగా వెళుతుంది. ఈ రహదారి నిర్మాణంతో రాజీవ్ రహదారి(Rajiv Road)పై రద్దీ తగ్గుతుంది. ప్రయాణ సమయం తగ్గి, ప్రమాదాల సంఖ్య కూడా తగ్గనుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రవాణా సౌలభ్యం పెరుగుతుంది. మార్గంలో ఉన్న ప్రాంతాలకు ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.