అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోంది. క్షేత్రస్థాయిలో అమలు తీరును అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇందులో భాగంగా.. బోధన్ మున్సిపల్ పరిధిలోని వివిధ హాస్టళ్లను మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ పరిశీలించారు.
శనివారం ఉదయం అల్పాహార సమయంలో పట్టణ పరిధిలో గల ఎస్సీ బాలికల హాస్టళ్లను, అదేవిధంగా బీసీ బాలికల హాస్టళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా అల్పాహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పరిసరాలు శుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవని కమిషనర్ సిబ్బందిని హెచ్చరించారు. కమిషన్ వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ గణేశ్ సీవో సంతోష్, జవాన్లు కిషోర్ తదితరులు ఉన్నారు.