అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains) కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు పడటం లేదు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం చెదురుమదురు వానలు పడే అవకాశం ఉంది. రోజంతా వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. అయితే ఆగస్టు 5, 6 తేదీల నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) పడనున్నాయి. ఈ ఆగస్టు సాధారణానికి మించి వానలు పడుతాయని అధికారులు ఇప్పటికే తెలిపారు. ఆగస్టు 5న ఉమ్మడి మహబూబ్నగర్ (Mahabubnagar), నల్గొండ (Nalgonda) జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. 6వ తేది నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయి.