ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Banakacherla | నారా లోకేష్ వ్యాఖ్యలపై స్పందించకపోవడం సరికాదు : వేముల ప్రశాంత్ రెడ్డి

    Banakacherla | నారా లోకేష్ వ్యాఖ్యలపై స్పందించకపోవడం సరికాదు : వేముల ప్రశాంత్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Banakacherla | తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం బనకచర్ల ప్రాజెక్టును (Bnakacherla) ఎలాగైనా కట్టి తీరుతామన్న ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara lokesh) వాఖ్యలపై ఇటు రాష్ట్ర బీజేపీ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సరికాదని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Mla prashanth reddy) అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం ముందుకు తీసుకువెళ్తోందని లోకేష్ మాటలను బట్టి అర్ధం అవుతోందన్నారు. బీజేపీ, టీడీపీ చేతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) కీలుబొమ్మలా మారాడని దుయ్యబట్టారు.

    తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా ఏ ఒక్కరు కూడా బనకచర్లపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. తమ పదవులు కాపాడుకోవడం కోసం నోరుమెదపడం లేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాటలను తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీలు ఖండించకపోవడం దారుణమన్నారు. గతంలో బనకచర్లపై చర్చల కోసం ఢిల్లీ వెళ్లేది లేదన్న సీఎం రేవంత్.. ఢిల్లీ బయలుదేరి వెళ్లడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

    READ ALSO  Meenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    తన గురువైన చంద్ర బాబు మెప్పుకోసం కేంద్ర పెద్దల సహకారంతో తన స్వప్రయోజనాల కోసం తెలంగాణాను తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేసే ​వారిని అడ్డుకుంటామని, తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్షా అన్నారు. రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

    Latest articles

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    More like this