అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం ధరలు పెరుగుతూ పోతుండడం సామాన్యులకు మింగుడుపడడం లేదు. శ్రావణమాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువ ఉంటాయి. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు.
కానీ, పెరిగిన ధరలతో సామాన్యులు ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఉంది. ఆగస్టు 2, 2025న బంగారం Gold, వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ బంగారం ధర రూ.210 తగ్గి, 10 గ్రాములకు రూ.99,810 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.91,490కి చేరింది. వెండి ధర కిలోకు రూ.2,000 తగ్గి , రూ.1,12,900 కి పడిపోయింది.
Today Gold Price : స్వల్ప తగ్గుదల..
ఈ ధరల తగ్గుదల దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కూడా కనిపిస్తోంది. అయితే నగరానుగుణంగా స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
ప్రధాన నగరాలలో ధరలు చూస్తే..
- హైదరాబాద్ Hyderabad లో 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు) రూ.99,810, 22 క్యారెట్ బంగారం రూ.91,490, వెండి (1 కిలో) రూ.1,22,900గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీ Delhi 24 క్యారెట్ బంగారం రూ.99,960, 22 క్యారెట్ బంగారం రూ.91,640, వెండి రూ.1,12,900గా నమోదైంది.
- ముంబయి Mumbai లో 24 క్యారెట్ బంగారం రూ. 99,810, 22 క్యారెట్ బంగారం రూ. 91,490, వెండి రూ. 1,12,900 గా ట్రేడ్ అయింది.
- చెన్నై Chennai లో 24 క్యారెట్ బంగారం రూ. 99,810, 22 క్యారెట్ బంగారం రూ. 91,490 , వెండి రూ. 1,22,900 గా నమోదైంది.
- బెంగళూరు Bengaluru లో 24 క్యారెట్ బంగారం రూ. 99,810, 22 క్యారెట్ బంగారం రూ. 91,490, వెండి రూ. 1,12,900 గా ట్రేడ్ అయింది.
ఫ్యూచర్స్ మార్కెట్లో Market బంగారం ధరలు కాస్త తగ్గినప్పటికీ రిటైల్ మార్కెట్లో తగ్గడానికి మాత్రం ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకిన నేపథ్యంలో బంగారు ఆభరణాల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోవడంతో అందరు అవాక్కవుతున్నారు.
ప్రస్తుతం పెరిగిన ధరలను చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ చైన్ కొనుగోలు చేయాలంటే కనీసం లక్ష రూపాయల పైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయి అనేది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.