- Advertisement -
HomeUncategorizedNagpur | ధనవంతులే టార్గెట్​.. ఎనిమిది మందిని పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నించిన కిలేడీ...

Nagpur | ధనవంతులే టార్గెట్​.. ఎనిమిది మందిని పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నించిన కిలేడీ అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ టార్గెట్​. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony Websites) ఇలాంటి నవ వరుళ్ల వివరాలు సేకరిస్తుంది. ఇన్​స్టా, ఫేస్​బుక్​లలో ఫ్రెండ్​ రిక్వెస్ట్ పంపుతుంది. వారు ఆక్సెప్ట్ చేశాక.. వారిని లైన్​లో పెడుతుంది.

తనకు విడాకులయ్యాయని, ఓ బిడ్డ ఉన్నట్లు వారిని ఎమోషనల్​గా పడేస్తుంది. చివరికి దగ్గరై పెళ్లి కూడా చేసుకుంటుంది ఈ మహారాష్ట్ర (Maharashtra) మాయలేడి. ఇలా ఏకంగా 8 వివాహాలు చేసుకుంది. తొమ్మిదో వివాహం కోసం ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కింది ఈ నిత్య పెళ్లికూతురు. నాగ్​పూర్​లో ​(Nagpur) వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Nagpur : పోలీసుల కథనం ప్రకారం..

సమీరా ఫాతిమా (Sameera Fatima) అనే టీచర్​ అందలం ఎక్కేందుకు అడ్డదారి ఎంచుకుంది. వయసు మీదపడి వివాహం కాని ధనవంతులే ఆమె టార్గెట్​. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వారికి దగ్గరవుతుంది. తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని నమ్మబలుకుతుంది. ఓ బిడ్డతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని మాయమాటలు చెబుతుంది. ఎదుటి వ్యక్తిని ముగ్గులోకి దింపి వివాహం చేసుకుంటుంది.

కొన్ని రోజులయ్యాక.. పథకం ప్రకారం వారిని పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈమెకు సపోర్టుగా ఆ అమాయక భర్తను బెదిరించే సపరేట్​ గ్యాంగ్​ను కూడా మెయింటెనెన్స్ చేస్తోంది. వీరి అండతో గత పదిహేనేళ్లలో ఎనిమిది వివాహాలు చేసుకుంది. వారి నుంచి భారీగా డబ్బులు లాగింది.

Nagpur : విచారణలో దిమ్మ తిరిగే విషయాలు..

తన నుంచి సమీరా బలవంతంగా రూ.50 లక్షలు వసూలు చేసిందని ఆమె బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఈ కిలేడీ విషయం వెలుగు చూసింది. దర్యాప్తులో (investigation) దిమ్మతిరిగే విషయాలు తేలాయి. ఈ మాయలేడీ సమీరా బాధితుల్లో రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) సీనియర్ అధికారులు సైతం ఉన్నట్లు తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు.

ఎనిమిది మంది అమాయకులను మోసగించిన సమీరా.. తాజాగా మరో పెళ్లి చేసుకునేందుకు పావులు కదిపింది. అలా జులై 29న నాగ్​పూర్​లోని ఓ ఛాయ్​ దుకాణం వద్ద ఈమె తొమ్మిదో వ్యక్తిని కలిసేందుకు వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమీరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News