అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Excise Enforcement | గంజాయి స్థావరాలపై వరుస దాడులు చేసి పెద్దఎత్తున నిల్వలను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను (Excise Enforcement Officers) ఉన్నతాధికారులు అభినందించారు. మంగళవారం ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కమలాసన్ రెడ్డి (State Director Kamalasan Reddy) ప్రత్యేకంగా జిల్లా అధికారులను ప్రశంసించారు. ఎక్సైజ్ సీఐ స్వప్నకు రూ.5,000, సిబ్బందికి రూ.10,000 నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఇటీవల సీఐ స్వప్న ఆధ్వర్యంలో పలు స్థావరాలపై దాడులు చేసి సుమారు 30 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారు.