అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | వర్షాల నేపథ్యంలో వరద సాఫీగా సాగేలా నాలాల్లో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆదేశించారు. ఆయన శుక్రవారం నగరంలోని బోరబండ, సున్నం చెరువు ప్రాంతాలను పరిశీలించారు. సున్నం చెరువును పూర్థిస్థాయిలో అభివృద్ధి చేయాలని హైడ్రా (Hydraa) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మురుగు నీటి కాల్వల డైవర్షన్ పనులను ఆయన పరిశీలించారు. వరద నీరు చెరువలోకి వచ్చేలా కాల్వల నిర్మించాలన్నారు
పద్మావతి నగర్ వద్ద నాలాను ఆక్రమించి నిర్మించిన షెడ్డులను తొలగించాలని స్థానికులు కమిషనర్‌ను కోరారు. నిబంధనల ప్రకారం ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ సూచించారు. అనంతరం ఆయన గచ్చిబౌలిలోని NGO కాలనీలోని మూసాయికుంట, గోసాయికుంటలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి రెండు చెరువులను అభివృద్ధి చేయాలని సిబ్బందికి సూచించారు. బడంగ్ పేట ప్రధాన రహదారిని దాటుకుంటూ మీర్‌పేట పెద్దచెరువుకు వెళ్లే నాలా విస్తరణ పనులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. గతంలో ఈ నాలాను ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఆ ఫంక్షన్ హాల్ యజమానులతోనే నాలా విస్తరణ పనులు చేయిస్తున్నారు.