అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad : అతడిని అమ్మాయి పబ్‌కి ఆహ్వానించింది. మత్తులో ముంచింది. టాస్క్ ఫోర్స్ పోలీసులను బెదిరించింది. ఓ ముఠా సాయంతో రూ.10 లక్షలు లాగడానికి ప్రయత్నించింది. చివరికి పోలీసులకు చిక్కింది.
పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా (Rangareddy district) అత్తాపూర్(Attapur)లో ఉంటున్న సచిన్ దూబే బంజారాహిల్స్‌లోని ఓ జ్యువెల్లరీ (jewellery) షాపులో అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, మనోడికి పబ్‌లకు వెళ్తుంటాడు.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి (Kukatpally) లో ఉన్న “కింగ్స్ అండ్ క్వీన్స్” పబ్ (Kings and Queens” pub) లో డింపుల్ యాదవ్ అనే అమ్మాయి డ్యాన్సర్‌గా పని చేస్తోంది. ఇక, విషయం ఏమిటంటే.. దూబేకు ఈ డింపుల్ పరిచయం అయింది. అయితే వక్రబుద్ధి కలిగిన డింపుల్.. దూబేను అడ్డుపెట్టుకుని అందలం ఎక్కాలని చూసింది.
అలా ప్లాన్ ప్రకారం.. డింపుల్ జులై 19న దూబేకు ఫోన్ చేసి పబ్‌కు రమ్మని ఆహ్వానించింది. సచిన్ తన వాహనాన్ని దూరంగా పార్క్ చేసి పబ్‌కు వెళ్లాడు. అక్కడ అతడికి దూబే ఫూటుగా తాగించింది. అర్ధరాత్రి పబ్ మూసేశాక, దూబేను తన బైక్ ఎక్కించుకుని బయలుదేరింది.
Hyderabad : కిడ్నాప్ డ్రామా..
బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నంబరు 3 వద్దకు చేరుకున్నారు. అక్కడికి ఫార్చ్యూనర్ కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు దూబేను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అతడికి మత్తు మందు ఇచ్చి, నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశారు. దూబే వద్ద ఉన్న బంగారు గొలుసు, ఇతర వస్తువులను లాగేసుకున్నారు.
మత్తు వదిలాక అతడిని బెదిరించడం మొదలెట్టారు. డింపుల్‌ను నువ్వు చంపేశావని, రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి ఒత్తిడి తాళలేక భార్యకు ఫోన్ చేశాడు. తనను కిడ్నాప్ చేశారని, డబ్బులు సర్దాలని కోరాడు.
Hyderabad : భయపడకుండా ధైర్యంగా సమాధానమిచ్చిన భార్య..
కానీ, డబ్బులు ఇవ్వడానికి దూబే భార్య ససేమిరా అంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తేల్చి చెప్పింది. దీంతో అతడిని దగ్గర ఉంచుకుని ఫలితం లేదని భావించిన దుండగులు దూబేను వదిలిపెట్టారు.
ఇంటికి చేరుకున్నాక తన భార్యకు జరిగిన విషయాన్ని దూబే చెప్పాడు. దీంతో ఇరువురు కలిసి జులై 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు డింపుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
డింపుల్ తన భర్త (Husband) పవన్ కుమార్‌తో కలిసి ఈ కిడ్నాప్ ప్లాన్ వేశారు. సచిన్ దూబే నుంచి భారీగా డబ్బు లాగాలని అనుకున్నారు. వీరికి హరికిషన్, సాయి ప్రసాద్, సుబ్బారావు జత కలిశారు. కానీ, దూబే భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో వీరి ప్లాన్ బెడిసికొట్టింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.