అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగర శివారులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkata Reddy) శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు రూరల్ ఎస్ హెచ్ వో ఆరిఫ్, స్థానికుల సహకారంతో (CC camera) ఖానాపూర్ ఎక్స్ రోడ్ తోపాటు ఖాజా హోటల్ ఎక్స్ రోడ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏసీపీ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో సౌత్ సీఐ సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
