National Awards
National Awards | 71వ నేష‌న‌ల్ అవార్డ్స్.. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ “భగవంత్‌ కేసరి” హనుమాన్, బలగంలకి కూడా అవార్డులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : National Awards | ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌ను (National Film Awards) ప్ర‌క‌టించింది. చలన చిత్రాల్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాలకు డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) అవార్డులు ప్ర‌క‌టించారు. 2023లో విడుదలైన సినిమాలకుగాను 71జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించ‌గా, కేంద్రం 22 భాషల్లో 115 సినిమాలకు అవార్డులు అనౌన్స్ చేసింది. ఉత్త‌మ తెలుగు చిత్రంగా బాల‌య్య బాబు (Balayya Babu) భ‌గ‌వంత్ కేస‌రికి అవార్డు ద‌క్కింది. జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు ఈ సారి షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) (జ‌వాన్), విక్రాంత్ మ‌స్సే(12th ఫెయిల్) ఎంపిక‌య్యారు. ఉత్త‌మ న‌టిగా మిస్సెస్ ఛ‌ట‌ర్జీ వర్సెస్ నార్వే (హిందీ)కి గాను రాణీ ముఖ‌ర్జీకి అవార్డ్ వ‌రించింది.

National Awards | అవార్డులు అందుకున్న సినిమాలు..

బెస్ట్ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ (కన్నడ), బెస్ట్ ఫిలిం క్రిటిక్: ఉప్పల్ దత్త, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ : ది ఫస్ట్ ఫిలిం, ప్రాణి దేశాయి, బెస్ట్ డైరెక్షన్: పీయూష్ ఠాకూర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ : లిటిల్ వింగ్, ది ఫస్ట్ ఫిలిం(మూవీ), బెస్ట్ నాన్ ఫ్యూచర్ ఫిలిం : ది సైలెంట్ ఎపిడిమిక్, ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌-గిధ్‌ ది స్కావెంజర్‌(హిందీ), ఉత్తమ నాన్‌ ఫీచర్‌ సినిమా: నెకల్‌(మళయాళం), సీ అండ్‌ సెవెన్‌ విలేజస్‌(ఒడియా), బెస్ట్ తెలుగు మూవీ : భగవంత్ కేసరి, బెస్ట్ తమిళ్ మూవీ : పార్కింగ్ , బెస్ట్ పంజాబీ మూవీ : గొడ్డే గొడ్డే చా, బెస్ట్ ఒడియా మూవీ : పుష్కర్, బెస్ట్ కన్నడ మువీ : కాండీలు, బెస్ట్ హిందీ మూవీ : కథాల్, బెస్ట్ గుజరాతీ మూవీ : వాష్, బెస్ట్ బెంగాలీ మూవీ : డీప్ ఫ్రిడ్జ్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ : హనుమాన్ (తెలుగు). ఉత్తమ సాంగ్ : బలగం (తెలుగు), బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ : బేబీ మూవీ (సాయి రాజేష్ ), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్​గా డైరెక్టర్ సుకుమార్ కూతురు శుకృతి వేణి ఎంపికైంది.

  • ఉత్తమ తమిళ చిత్రం (ఫీచర్): పార్కింగ్ – రామ్‌కుమార్ బాలకృష్ణన్ (దర్శకుడు)
  • ఉత్తమ గారో సినిమా : రిమ్డోగిట్టంగా (రాప్చర్) (గారో – ఈశాన్య భారతదేశంలోని గారో భాషలో తీసిన సినిమా)
  • ఉత్తమ తాయ్ ఫేక్ సినిమా : పై టాంగ్: స్టెప్ ఆఫ్ హోప్
  • ఫీచర్ ఫిల్మ్ విభాగంలో స్పెషల్ మెన్షన్: యానిమల్
  • ఉత్తమ నాన్-ఫీచర్ చిత్రం : ది ఫ్లవరింగ్ మాన్ (హిందీ)
  • ఉత్తమ కళల/సాంస్కృతిక చిత్రం: టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)

National Awards | ఇతర భాషల సినిమాలకు..

  • ఉత్తమ మేకప్ ‘సామ్ బహదూర్’ కు లభించింది.
  • ఉత్తమ సంగీత దర్శకత్వం – వాతి, యానిమల్ – GV ప్రకాష్ కుమార్, హర్షవర్ధన్ రామేశ్వర్
  • ఉత్తమ కొరియోగ్రఫీ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ లోని ‘ధింధోరా బజే రె’ (హిందీ)- వైభవి మర్చంట్
  • ఉత్తమ అస్సామీ (ఫీచర్) సినిమా – ‘రొంగటపు’
  • ఉత్తమ బెంగాలీ (ఫీచర్) సినిమా – ‘డీప్ ఫ్రిడ్జ్’
  • ఉత్తమ గుజరాతీ (ఫీచర్) సినిమా – ‘వష్’
  • ఉత్తమ హిందీ సినిమా – యశోవర్ధన్ మిశ్రా దర్శకత్వం వహించిన కథల్.