అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Forecast | వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయి. మే నెలలో వానలు దంచికొట్టాయి. దీంతో రైతులు (Farmers) ఈ ఏడాది పంటలు ఢోఖా లేదని భావించారు. ఈ మేరకు రుతుపవనాలు కూడా ముందుగానే ప్రవేశించాయి. అయితే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత భారీ వర్షాలు (Heavy Rains) పడులేదు.
జూన్లో అడపాదడప వానలు పడిన జులై చివర వరకు వరుణుడు ముఖం చాటేశాడు. సాగు చేసిన పంటలు (Crops) ఎండుతున్న క్రమంలో జులై రెండో అర్ధభాగంలో భారీ వర్షాలు అన్నదాతలను ఆదుకున్నాయి. నాలుగైదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆగస్టులో వర్షాలు ఎలా ఉంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అన్నదాతలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
Rain Forecast | భారీ వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు. వరుస వర్షాలతో వాతావరణం చల్లగా ఉంటుందన్నారు. ఆగస్టు 5, 6 తేదీల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగస్టు 7 నుంచి 15 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయి. దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
Rain Forecast | అల్ప పీడన ప్రభావంతో..
బంగాళాఖాతంలో ఏర్పడే వరుస అల్ప పీడనాలతో (LPA) ఆగస్టు 15 నుంచి 23 వరకు మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయి. ఈ సమయంలో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతాయి. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 1 మధ్య భారీ వానలు పడే అవకాశం ఉంది.