అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ (PC Gosh) గురువారం తన నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ఆయన నివేదిక అందించారు. కాళేశ్వరం (Kaleshwaram ) నిర్మాణంలో అక్రమాలు, ప్రాజెక్ట్ డిజైనింగ్‌లో మార్పులు, అనుమతులు లేకుండానే నిధుల విడుదల వంటి అంశాలపై కమిషన్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ నివేదికను అధికారులు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి అందించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నివేదికను సీఎంకు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Kaleshwaram Commission | ఉన్నత స్థాయి కమిటీ..
కాళేశ్వరం కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ (High-level committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేయనుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ నెల 4న కమిటీ కమిషన్ నివేదిక సారాంశాన్ని మంత్రిమండలికి సమర్పించనుంది.
Kaleshwaram Commission | మంత్రివర్గంలో చర్చ
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగినట్లు కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో అనేక వైఫల్యాలు చోటు చేసుకున్నాయని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. దీనికి పలువురు కారణమని నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నివేదికపై మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో చర్చించనున్నారు. అనంతరం దీనిని అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.