ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​ACP raja Venkat reddy | ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలి

    ACP raja Venkat reddy | ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: ACP raja Venkat reddy | ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలని ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్​ను (Indalwai Police Station) ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్​స్టేషన్​ పరిసరాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్​ను పరిశీలించారు.

    పోలీస్​స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్​స్టేషన్​కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

    ACP raja Venkat reddy | స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా..

    స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న దృష్ట్యా పోలీసులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏసీపీ సూచించారు. ఆన్​లైన్​ గేమ్స్ (Online Games), ఆన్​లైన్​ బెట్టింగ్​పై (Online Betting) నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ (PDS Rice), అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు సీసీటీఎన్​ఎస్​ డాటా అప్​డేట్​ ఉన్నందున అధికారులను సిబ్బందిని అభినందించారు. (వీపీవో) విలేజ్ పోలీస్ ఆఫీసర్​కు కేటాయించిన గ్రామాలు, వార్డులను తరచుగా సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపర్చుకోవాలన్నారు.

    READ ALSO  Task force raids | వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి.. పలువురి అరెస్టు

    ACP raja Venkat reddy | వాకింగ్​, రన్నింగ్​ చేయాలి..

    సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని, సమయం దొరికినప్పుడల్లా వాకింగ్, రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని పోలీసు సిబ్బందికి ఏసీపీ సలహా ఇచ్చారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల పట్ల సానుభూతితో వ్యవహరించాలని.. భార్యాభర్తలకు కౌన్సెలింగ్​ ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో టోల్ ప్లాజా ఉన్నందున రోజూ విస్తృతంగా తనిఖీలు చేయాలని ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు.

    పోలీస్​స్టేషన్​లో అధికారులతో మాట్లాడుతున్న ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this