Sheep Distribution Scam
Sheep Distribution Scam | గొర్రెల పంపిణీ స్కాం ఈడీ సంచలన ప్రకటన.. రూ.వెయ్యి కోట్ల అవినీతి..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ED Raids | తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు గతంలో అంచనా వేసింది. కాగా.. తాజా దర్యాప్తులో రూ. వెయ్యి కోట్ల వరకు ఉండొచ్చని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) నివేదిక ఆధారంగా.. కేవలం ఏడు జిల్లాల్లోనే రూ.253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు పేర్కొంది.

 ED Raids | 2015లో పథకం ప్రారంభం

గత ప్రభుత్వం 2015లో గొర్రెల పంపిణీ పథకాన్ని(Sheep Distribution Scam) ప్రారంభించింది. దీని ద్వారా వేల మంది లబ్ధిదారులకు సుమారు రూ. 4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ పథకంలో అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులను స్వాహా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు(ACB Case) నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.

 ED Raids | ఈడీ అధికారుల సోదాలు

హైదరాబాద్‌(Hyderabad)లోని సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్, అత్తాపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో జులై 30న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్​తో పాటు మరికొందరి నివాసాలలో తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

 ED Raids | బినామీ ఖాతాలకు..

ఈడీ(Enforcement Directorate) ఎంక్వయిరీలో గొర్రెల పంపిణీలో అవినీతి జరిగినట్లు తేలింది. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి.. నిధులను బినామీ ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. ఇందులో అధికారులు, దళారులు వాటాలు పంచుకున్నట్లు సమాచారం. కాగా.. రైతులకు ఎన్నికల కోడ్(Election Code) కారణంగా నిధుల విడుదల ఆలస్యమైనట్లు చెప్పినప్పటికీ, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిధులు వారికి చేరలేదని సమాచారం.

 ED Raids | సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ

కాగా.. ఈడీ ప్రకటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణంలో రూ. వెయ్యి కోట్ల వరకు అవినీతి జరిగినట్లు అంచనా వేసింది. సీఏజీ నివేదిక ప్రకారం.. ఏడు జిల్లాల్లో రూ.253 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుందని ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసులో పలువురు అధికారులు ఇప్పటికే అరెస్టు కాగా.. మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.