ePaper
More
    Homeఅంతర్జాతీయంModel Arrest | బంగ్లాదేశ్​ మోడల్​ను అరెస్ట్​ చేసిన కోల్​కతా పోలీసులు.. ఎందుకో తెలుసా!

    Model Arrest | బంగ్లాదేశ్​ మోడల్​ను అరెస్ట్​ చేసిన కోల్​కతా పోలీసులు.. ఎందుకో తెలుసా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Model Arrest | బంగ్లాదేశ్​ మోడల్​ శాంత పాల్​ను కోల్​కతాలో (Kolkata) పోలీసులు అరెస్ట్​ చేశారు. కోల్‌కతా పోలీసుల యాంటీ-రౌడీ స్క్వాడ్ (Kolkata Police Anti-Rowdy Squad) ఆమెను అరెస్టు చేసింది. 28 ఏళ్ల శాంతపాల్ రీజెంట్ ఎయిర్‌వేస్ (బంగ్లాదేశ్) కంపెనీలో సిబ్బంది సభ్యురాలిగా పనిచేస్తోంది. అంతేగాకుండా ఆమె చిన్న మోడల్​. కొన్ని నెలల క్రితం భారత్​కు వచ్చిన ఆమె ఇక్కడే ఉండిపోయింది. అంతేగాకుండా నకిలీ ఆధార్​ కార్డు, ఓటర్​ కార్డు, రేషన్​ కార్డు తీసుకోవడం గమనార్హం.

    Model Arrest | మోసం కేసులో అరెస్ట్​

    కోల్‌కతా నగరంలోని బిక్రామ్‌గఢ్ (Bikramgarh) ప్రాంతంలో ఆమె నివసిస్తోంది. ఒక ఏజెంట్ ద్వారా ఆమె నకిలీ ఆధార్​కార్డు, ఓటర్​ కార్డు, రేషన్​ కార్డు తీసుకుంది. మోసం కేసుకు సంబంధించి దక్షిణ కోల్‌కతాలోని బిక్రామ్‌గఢ్ ప్రాంతంలో శాంత పాల్‌ను (Shanta Paul) అరెస్టు చేశారు. ఆమెపై మోసం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె దగ్గర రెండు నకిలీ ఆధార్​ కార్డులు, ఓటర్​ ఐడీ, రేషన్​ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    READ ALSO  Bihar | లేడీ కానిస్టేబుల్​పై లైంగిక దాడి..! రెండేళ్లలో మూడు అబార్షన్లు

    Model Arrest | ఫ్లుడ్​ వాగర్​

    ఫ్లుడ్​ వాగర్​ అయిన శాంతపాల్ విదేశాలకు వెళ్లాలని ప్లాన్​ చేసింది. అయితే బంగ్లాదేశ్ ​(Bangladesh) నుంచి చాలా దేశాలకు వెళ్లడానికి వీలు కాలేదు. దీంతో ఆమె భారత్​లోకి ప్రవేశించి భారతీయురాలిగా ఇతర దేశాలకు వెళ్లాలని ప్లాన్​ వేసింది. ఇందులో భాగంగా ఆధార్​, ఓటర్​ కార్డులు (Voter Card) తీసుకుంది. స్థానికురాలిగా నటిస్తూ కార్ల అద్దె వ్యాపారం నిర్వహిస్తోంది. అంతేగాకుండా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్​లో పోస్ట్​ చేసిన వీడియాల్లో తాను భారతీయురాలిని అని నిరూపించుకునే వ్యూహంలో భాగమని పోలీసులు తెలిపారు.

    Model Arrest | ఆందోళన కలిగించే అంశం

    బంగ్లాదేశ్​కు చెందిన ఎంతో మంది అక్రమంగా భారత్​లోకి ప్రవేశిస్తున్నారు. ఎంతోమంది నకిలీ ఓటర్​ కార్డులు(Fake Aadhar Cards), ఆధార్​ కార్డులు పొందారని బీజేపీ గత కొంతకాలంగా ఆరోపిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్​ మోడల్​ వేర్వేరు అడ్రస్​లతో రెండు నకిలీ ఆధార్​ కార్డులు పొందడం వెలుగులోకి రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలా ఎంత మంది వచ్చి అక్రమంగా ఉంటున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    READ ALSO  Al-Qaeda Terror | గుజ‌రాత్‌లో అల్‌ఖైదా టెర్ర‌ర్ మాడ్యూల్.. మ‌హిళను అరెస్టు చేసిన ఏటీఎస్‌

    Latest articles

    Meenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    అక్షరటుడే, ఆర్మూర్​: Meenakshi Natarajan Padayatra | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర...

    Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని...

    Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: షబ్బీర్​ అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government...

    Health Camp | రేపు శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో మెగా వైద్యశిబిరం

    అక్షరటుడే, ఇందూరు: Health Camp | నగరంలోని శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu Sangham) మెగా వైద్య శిబిరం...

    More like this

    Meenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    అక్షరటుడే, ఆర్మూర్​: Meenakshi Natarajan Padayatra | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర...

    Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని...

    Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: షబ్బీర్​ అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government...