అక్షరటుడే కామారెడ్డి: Kamareddy Degree College | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రవేశపెట్టాలని విద్యార్థి సేన సంఘం (Vidyarthi Sena Sangam) నాయకులు డిమాండ్ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.విజయ్ కుమార్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రవేశపెట్టడం ఎంతో అవసరమన్నారు.
దూర ప్రాంతాల పేద, మధ్యతరగతి కుటుంబ విద్యార్థులు అధిక ఖర్చుల కారణంగా ఈ కోర్సులు చదవలేకపోతున్నారని తెలిపారు. కళాశాలల్లో ఈ కోర్సులు ప్రవేశం పెట్టడం వల్ల ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న ఐటీ, కార్పొరేట్ రంగాల్లో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
ఉన్నత విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు ప్రద్యుమ్న, గోపాల్, అంజి, వంశీ, రవళి, ప్రవళిక, స్వరూప తదితరులు పాల్గొన్నారు.