Krishna River
Krishna River | కృష్ణానదికి భారీగా వరద.. అన్ని ప్రాజెక్ట్​ల గేట్లు ఓపెన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Krishna River | ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మకు (Krishnamma) వరద పోటెత్తుతోంది. భారీగా వరద (Heavy Flood) వస్తుండడంతో నదిపై గల అన్ని ప్రాజెక్ట్​ల గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్​ రిజర్వాయ్​ల నుంచి జూరాల ప్రాజెక్ట్​కు (Jurala Project) భారీగా వరద వస్తోంది. ఈ ఏడాది రెండు జలాశయాల నుంచి ఇప్పటి వరకు 308 టీఎంసీల నీరు జూరాలకు వచ్చింది. వర్షాకాలం ముగిసేలోపు మరో 300 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నారాయణపూర్​ డ్యాం నుంచి 1.1 లక్షల క్యూసెక్కులు, ఆల్మట్టి నుంచి 1.4 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Krishna River | శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత

నారాయణపూర్​, ఆల్మట్టి నుంచి భారీగా వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్ట్​ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్​ ఉత్పత్తి, వరద గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్లు శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్ట్​ల నుంచి శ్రీశైలం డ్యామ్​కు (Srisailam Dam) వరద పోటెత్తింది. ప్రస్తుతం 2.73 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్​ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేపడుతున్నారు. అలాగే ​8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ నుంచి మొత్తం 2.82 లక్షల క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదవుతోంది.

 Krishna River | ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి

నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్ ​(Nagarjuna Sagar Project) ఇప్పటికే నిండుకుండలా మారింది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. విద్యుత్​ ఉత్పత్తి సైతం కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్ట్​ సైతం నిండడంతో నాగర్జున సాగర్​ నుంచి వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) భారీగా వరద వస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 2,18,771 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండడంతో అధికారులు 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు.