అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకొని తీరుతామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో (Telangana Bhavan) మీడియాతో మాట్లాడారు. ఏపీ మంత్రి లోకేశ్ (AP Minister Lokesh) గురువారం మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) నిర్మిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మిగులు జలాలతో ప్రాజెక్ట్ కట్టుకుంటే మీకు అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై హరీశ్ రావు స్పందించారు. బనకచర్ల కట్టి తీరుతామని లోకేష్ అంటున్నాడని.. కానీ తాము అడ్డుకుంటామని ఆయన చెప్పారు. కోర్టులకు వెళ్లయిన తెలంగాణకు (Teangana) రావాల్సిన వాటాను కాపాడుకుంటామని ఆయన చెప్పారు.
Harish Rao | అన్ని అనుమతులు ఉన్నాయి
లోకేశ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుమతులు లేకుండా కట్టారని వ్యాఖ్యానించారు. దీనిపై హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు 11 అనుమతులు ఉన్నాయని వెల్లడించారు. ‘‘మా నీళ్లు మాకు కావాలంటే.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని” వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్, కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపుపై పోరాటం చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టమేనా అని ప్రశ్నించారు.
Harish Rao | కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం లేదు
ఏపీ మంత్రి లోకేశ్ బనకచర్ల కట్టి తీరుతామని అంటుంటే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడడం లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుదక్షణ చెల్లించుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడకున్నా.. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.