Vice-Presidential elections | రసవత్తంగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఎన్నిక.. అసలు ఏమిటీ ఉపరాష్ట్రపతి పదవి..?
Vice-Presidential elections | రసవత్తంగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఎన్నిక.. అసలు ఏమిటీ ఉపరాష్ట్రపతి పదవి..?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్​ విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసింది. గురువారం ఎలక్టోరల్ కాలేజీ జాబితాను (Electoral College List) ఖరారు చేసిన ఈసీ శుక్రవారం షెడ్యూల్​ ప్రకటించింది.

Vice President Election | ఆగస్టు 7న నోటిఫికేషన్​

ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఆగస్టు 7న నోటిఫికేషన్​ వెలువడనుంది. 21 వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. 22న నామినేషన్లను పరిశీలిస్తారు. 25వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్​ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక (Vice President Election) నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్​ చేపడతారు. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

Vice President Election | మొత్తం ఓట్లు 782

జగదీప్​ ధన్​ఖడ్ ​(Jagdeep Dhankhar) గత నెల 21న తన పదవికి రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసింది. రాజ్యసభ, లోక్​సభ ఎంపీలు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. లోక్​సభలో (Loksabha) మొత్తం సీట్లు 543 కాగా.. ప్రస్తుతం ఒక సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో (Rajya Sabha) 245 స్థానాలకు  గాను ఐదు ఖాళీగా ఉన్నాయి. రెండు సభల్లో కలిపి ప్రస్తుతం 782 మంది ఉన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే 392 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. అయితే అధికార ఎన్​డీఏ కూటమికి 422 మంది ఎంపీల బలం ఉంది. దీంతో ఎన్నిక లాంఛనం కానుంది. అయితే విపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థిని నిలబెడతాయా.. ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తాయా అనేది తెలియాల్సి ఉంది.