Power Cut
Power Cut | రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, ఇందూరు: Power Cut | నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్​కో (Transco) టౌన్​ ఏడీఈ చంద్రశేఖర్ (Town ADE Chandrasekhar)​ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పులాంగ్​ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కరెంటు ఉండదని ఆయన వివరించారు.

Power Cut | ఏయే ప్రాంతాల్లో..

నగరంలోని వినాయక్ నగర్ (Vinayak nagar), రానా టవర్, అభ్యాస స్కూల్ (Abhyasa School), ఆకాశ్​ అపార్ట్​మెంట్స్​, శివాలయం, కాకతీయ స్కూల్ (Kakatiya School), దేవి టాకీస్, వేణుమాల్ (Venu Mall), పులాంగ్ రైతు బజార్ ప్రాంతాల్లో విద్యుత్​ అంతరాయం ఉంటుందని ఆయన వివరించారు. కావున విద్యుత్​ వినియోగదారులు సహకరించాలని కోరారు.