- Advertisement -
Homeలైఫ్​స్టైల్​Excessive Sleep | అతినిద్ర ఆరోగ్యానికి చేటు..తొమ్మిది గంట‌లకు మించి నిద్రతో మృత్యు ముప్పు అధికం

Excessive Sleep | అతినిద్ర ఆరోగ్యానికి చేటు..తొమ్మిది గంట‌లకు మించి నిద్రతో మృత్యు ముప్పు అధికం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Excessive Sleep | మాన‌వ దైనందిక జీవితంలో అతిముఖ్య‌మైన‌ది నిద్ర‌. ఆరోగ్య‌ప‌రంగా, మానసికంగా బాగుండాలంటే నిద్ర త‌ప్ప‌నిస‌రి. 24 గంట‌ల దిన‌చ‌ర్య‌లో శ‌య‌నించ‌డం చాలా కీలకం. ఎందుకంటే ఇది శరీరానికి అవసరమైన విశ్రాంతి పొందడానికి, ఉత్తేజితం కావ‌డానికి సహాయపడుతుంది. అయితే, మ‌నిషికి క‌నీసం ఆరు గంట‌ల నిద్ర అవ‌స‌ర‌మని వైద్య ప‌రిశోధ‌న‌లు(Medical Research) తెలిపాయి. త‌క్కువ నిద్ర పోతే క‌లిగే ఆరోగ్య‌, మానసిక రుగ్మ‌త‌ల గురించ వెల్ల‌డించాయి. అయితే, తక్కువ నిద్ర వల్ల కలిగే ప్రమాదాల గురించి పదే గుర్తు చేయబడుతున్నప్పటికీ, ఎక్కువ నిద్ర గురించి ఇన్లాళ్లు పెద్దగా చర్చ లేదు. తొలిసారి దీనిపై అధ్య‌య‌నం చేయ‌గా, కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. అతినిద్ర‌తో ప్రాణాలకు ముప్పు అని తేలింది.

Excessive Sleep | మృత్యు ముప్పు 34 శాతం అధికం..

ఆరోగ్యంతో పాటు మృత్యు ముప్పును నిద్ర ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తించ‌డానికి ఇటీవ‌ల ఓ అధ్య‌య‌నం చేశారు. ప్రతి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య నిద్రపోయే వ్యక్తులతో ఏడాది పాటు జ‌రిగిన అధ్య‌య‌నంలో అతి నిద్ర వ‌ల్ల క‌లిగే ప్ర‌మాదాలను గుర్తించారు. గ‌తంలో చేసిన 79 అధ్య‌యనాల డేటాను ప‌రిశీలించి, చివ‌ర‌కు అతి నిద్ర(Excessive Sleep) అనర్ధ‌దాయ‌మ‌ని వెల్ల‌డించారు. రాత్రికి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తుల్లో మరణ ప్రమాదం 14 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. అయితే, 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తుల్లో ఇది 34 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. 9 గంటల కంటే ఎక్కువ‌గా నిద్రపోవడం వల్ల ముందస్తు మరణాలలో 14 శాతం పెరుగుదల ఉందని ఈ అధ్యయనం లో తేలింది.

- Advertisement -

Excessive Sleep | 7 గంట‌లు చాలు..

శాస్త్రీయ ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం ఒక మ‌నిషికి 7 గంట‌ల నిద్ర(7 Hours of Sleep) అవ‌స‌రం. కానీ, ఇది వ్య‌క్తులు, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మారుతుంద‌ని హార్వర్డ్ హెల్త్ చెబుతోంది. కొంతమందికి ఏడు గంటల కన్నా తక్కువ అవసరం, మరికొందరికి ఎక్కువ అవసరం కావచ్చ‌ని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌(Harvard Medical School)లోని స్లీప్ మెడిసిన్ విభాగానికి చెందిన ఎరిక్ జౌ(Eric Zhou) తెలిపారు. ఆరోగ్యకరమైన పెద్దలకు రాత్రికి కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. “ఏడు గంటల కన్నా తక్కువ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడటం, పనితీరు తగ్గడం వంటి ప్ర‌మాదాలు రావొచ్చు. నిరంతర నిద్ర లేకపోవడం కూడా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, బరువు పెరగడం, ఊబకాయం, మధుమేహం మరియు నిరాశ వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉందని” ఎరిక్ జౌ తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News