అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు(Kasam Venkateswarlu) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ను కొట్టి వేసింది. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్రెడ్డి అన్నారని పిటిషనర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి హైకోర్టులో (High Court) క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు కాసం వెంకటేశ్వర్లు పిటిషన్ను కొట్టివేసింది.