అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chahal | భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో ఉద్వేగభరితంగా స్పందించారు. భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) చేసిన మోసంతో తాను తీవ్ర మనోవేదనకు గురై, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించినట్టు చాహల్(Chahal) చెప్పారు. ఒకవేళ తనకు నమ్మకమైన స్నేహితులు సహాయపడకపోయినట్లయితే, పరిస్థితి ఎంతటి దాకైనా వెళ్లేదని ఆయన ఓపెన్ అయ్యారు. 2020 డిసెంబర్‌లో డ్యాన్సర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్న చాహల్… 2024 మార్చిలో ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ విడాకుల ప్రక్రియ అనంతరం తాను మానసికంగా ఎంతో క్షోభని అనుభవించినట్టు పేర్కొన్నారు.
Chahal | సూసైడ్ చేసుకోవాలనుకున్నా..
నిజంగా నాలో జీవించాలనే ఉత్సాహం ఆవిరైంది. రోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. ప్రతి రోజు ఏడ్చే రోజులూ వచ్చాయి. దాదాపు 45 రోజులు నరకంలా గడిచాయి. ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన సమయంలో తన సన్నిహితులతో మాట్లాడటం ద్వారా తాను కాస్త ఓదార్పు పొందానని చాహల్ తెలిపారు. “వాళ్లు నన్ను గట్టిగా పట్టుకున్నారు. జీవితంపై భయం పోగొట్టారు” అని వెల్లడించారు. విడాకుల (Divorce) అనంతరం తనపై వచ్చిన విమర్శలపై కూడా చాహల్ గట్టిగా స్పందించారు. విడాకుల విషయంలో నేనే మోసం చేశానని నిందించారు. కానీ నేను ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు. అలాంటి మనిషిని కాదు. నమ్మకాన్ని పాటించే వ్యక్తిని అని స్పష్టం చేశారు. మా రిలేషన్‌షిప్(Relationship)కు సంబంధించి ఏం జరిగిందో కొంతమందికి ఏమి తెలియకపోయిన వారు నన్ను తప్పుపట్టారు అని చాహల్ అన్నాడు.
ఇద్దరం కూడా కెరీర్‌లో విజయాన్ని సాధించాలని అనుకున్నాం. అదే కారణంగా, వ్యక్తిగత బంధానికి తగినంత సమయం ఇవ్వలేకపోయాం. ఒక దశలో భావోద్వేగ సంబంధాలు కూడా సడలిపోవడంతో రాజీ పడడం తప్ప ఇతర మార్గం కనిపించలేదు. అయితే రెండు వ్యక్తుల లక్ష్యాలు, వ్యక్తిత్వాలు ఒకే దిశగా లేకపోతే, ఆ ప్రభావం రిలేషన్‌పై తప్పక పడుతుంది. తాను మానవత్వంతో కూడిన జీవితం గడుపుతున్నానని చెప్పారు. నాకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. చిన్నప్పటినుంచి వారితోనే పెరిగాను. ఆడవారిని గౌరవించడం నేను నా తల్లిదండ్రుల నుండి నేర్చుకున్నాను అని పేర్కొన్నారు. తన పేరును బలవంతంగా వివాదాల్లోకి లాగడం బాధించేదని అన్నారు. ఈ కష్టాలను అధిగమించి మళ్లీ ఆటపై దృష్టిపెట్టిన చాహల్ ప్రస్తుతం మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెడుతున్నాడు. ఒకప్పుడు ఆత్మహత్య గురించి ఆలోచించిన వ్యక్తి, ఇప్పుడు తన జీవితంలో మళ్ళీ గెలుస్తున్నాడంటే అది నిజంగా అభినందించదగిన విషయం.