అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Urvashi Rautela | బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా కు లండన్‌లో ఊహించని షాక్ తగిలింది. వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌కు హాజరవ్వడానికి లండన్‌కి వెళ్లిన ఆమెకు గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్(Gatwick Airport)లో అనుకోని సమస్య ఎదురైంది. ఆమెకు అత్యంత ప్రియమైన డియోర్ బ్రౌన్ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్(Dior Brown Luxury Handbag)ను ఎవరో అపహరించారని తెలుస్తోంది. ఆ బ్యాగులో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఊర్వశి వెల్లడించారు. ముంబై నుంచి లండన్ చేరుకున్న ఊర్వశి, గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన కొద్ది సమయంలోనే తన బ్యాగ్ కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది(Airport Staff)ని సంప్రదించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Urvashi Rautela | అంత అజాగ్రత్తనా..
ఊర్వశి తన బ్యాగ్ పోయిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు, తన అభిమానులు సాయం చేయాలని కోరింది. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి. “డియోర్ బ్రౌన్ బ్యాగ్ పోగొట్టుకున్న మొదటి హీరోయిన్ మీరే” అంటూ కొంతమంది కామెంట్ చేస్తుండగా, మరికొంతమంది ఆమెను ఓదార్చుతూ “మీ బ్యాగ్ త్వరలోనే దొరుకుతుంది, ధైర్యంగా ఉండండి” అని అన్నారు. గతంలో కూడా ఊర్వశి పలు వస్తువులు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. 2023లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా చెవిపోగు పోగొట్టుకున్నారని వార్తలు వచ్చాయి.
అలానే ఓ సారి తన ఐఫోన్ (I Phone) కూడా చోరీకి గురైందని ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) పేర్కొన్నారు. ఇక ఊర్వశి రౌతేలా చివరిగా సన్నీ డియోల్‌తో కలిసి నటించిన జాట్ చిత్రంలో కనిపించారు. అంతకు ముందు నందమూరి బాలకృష్ణతో కలిసి డాకూ మహరాజ్ చిత్రంలో కూడా నటించారు. ప్రస్తుతం తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీలో అయితే వెల్‌కమ్ టు ది జంగల్, కసూర్ 2 వంటి ప్రాజెక్టుల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూడు సినిమాలు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.