అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actress Kalpika | సినీ నటి కల్పిక (Actress Kalpika) గణేష్ ఈ మధ్య నిత్యం వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పలు వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో ఆమెపై తండ్రి సంఘవార్ గణేష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో (Gachibowli Police Station) ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా తన కుమార్తె మానసిక పరిస్థితి ఆందోళన కలిగించేలా మారిందని, ఆమె వల్ల కుటుంబ సభ్యులకు, ఇతరులకు ముప్పు ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించగా, కోర్టు ఆదేశాల మేరకు అవసరమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తండ్రికి భరోసా ఇచ్చారు.
Actress Kalpika | తండ్రి కంప్లైంట్..
గతంలో కల్పిక పునరావాస కేంద్రంలో (Rehabilitation Center) చికిత్స పొందిందని, కానీ గత రెండేళ్లుగా ఆమె వైద్యుల సూచించిన మందులు తీసుకోవడం మానేసిందని గణేష్ తెలిపారు. దీంతో ఆమె ప్రవర్తనలో తీవ్ర మార్పులు వచ్చాయని, తరచూ గందరగోళంగా, దూకుడుగా ప్రవర్తిస్తూ బహిరంగంగా వివాదాస్పద ఘటనలకు కారణమవుతోందని చెప్పారు. ఇటీవల మొయినాబాద్‌లోని (Moinabad) ఓ రిసార్ట్‌లో ఆమె చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యాహ్నం ఒంటరిగా క్యాబ్‌లో రిసార్ట్‌కు (Resort) వచ్చిన కల్పిక, రిసెప్షన్‌లో అడుగుపెట్టగానే మేనేజర్‌తో దురుసుగా ప్రవర్తించింది. మెనూ కార్డు విసిరేయడం, రూమ్ తాళాలను మేనేజర్ ముఖంపై వేయడం, బూతులు మాట్లాడడం వంటి చర్యలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి.
గతంలో కూడా గచ్చిబౌలిలోని (Gachibowli) ఓ పబ్‌లో ఆమె అర్థరాత్రి హంగామా చేయడం, పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి ప్రవర్తించడం, కేసు నమోదు కావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. కల్పిక తండ్రి(Kalpika Father) ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె మానసిక ఆరోగ్యం విషయంపై పెద్ద చర్చ మొదలైంది. నెటిజన్లు, పరిశ్రమ వర్గాలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. పోలీసుల జోక్యంతో ఆమెను మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్చే ప్రయత్నాలు మొదలయ్యే అవకాశం ఉంది. కల్పిక నటిగా జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, హిట్ వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఈ అమ్మడు ఇటీవల చేస్తున్న రచ్చతో అందరి దృష్టిలో నెగెటివ్ అయింది.