ePaper
More
    Homeక్రీడలుHCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    HCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association – HCA) భారీ కుదుపునకు గురైంది. HCA అధ్యక్షుడిగా ఉన్న జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు హెచ్​ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ (HACA Apex Council) ప్రకటించింది. ఆయనతోపాటు కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి శ్రీనివాస్ రావును సైతం పదవుల నుంచి తొలగించినట్లు తెలిపింది. జులై 28, 2025న కౌన్సిల్​ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ వెల్లడించింది.

    HCA | ఇంత కఠిన నిర్ణయం ఎందుకంటే..

    సస్పెండ్​కు గురైన ముగ్గురిపై అధికార బలాన్ని దుర్వినియోగం చేయడం, మోసం, నిధుల దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై హెచ్ఏసీఏ దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు హెచ్ఏసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

    READ ALSO  Mla Dhanpal | కమ్యూనిటీ హాల్ నిర్మాణం.. అభినందనీయం

    నైతిక విలువలు, పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని హెచ్ఏసీఏ కౌన్సిల్ స్పష్టం చేసింది. సంఘం న్యాయబద్ధతను కాపాడేందుకే ఈ ముగ్గురిపై కఠినంగా వ్యవహరించినట్లు హెచ్ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ HACA Apex Council వెల్లడించింది.

    HCA : ఆరుగురిపై సీఐడీ కేసు..

    కాగా, హెచ్​సీఏ నిధుల గోల్​మాల్, ఐపీఎల్ టికెట్ల (IPL tickets) ఇష్యూ కేసులో హెచ్​సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు(HCA President Jaganmohan Rao), ప్రధాన కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితపై గతంలోనే సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కౌన్సిల్​ వారిపై వేటు వేసింది.

    కాగా, ఐపీఎల్ టికెట్ల వివాదంలో (జులై 9న) హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ మోహన్ తో పాటు హెచ్​సీఏ ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా కౌన్సిల్​ వారిపై సస్పెన్షన్​ వేటు వేసింది.

    READ ALSO  Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this