ePaper
More
    HomeతెలంగాణAnil Eravatri | బ్రిటీషర్ల తొత్తు..దేశ ద్రోహి వీర్​ సావర్కర్​ : ఈరవత్రి అనిల్​

    Anil Eravatri | బ్రిటీషర్ల తొత్తు..దేశ ద్రోహి వీర్​ సావర్కర్​ : ఈరవత్రి అనిల్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Anil Eravatri : వీర్ సావర్కర్ పదేళ్లు జైళ్లో ఉన్నా.. దేశానికి అవసరమైన సమయంలో మాత్రం బ్రిటీష్(British) వారికి తొత్తుగా మారి దేశానికే ద్రోహం చేశారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఈరవత్రి అనిల్ ఆరోపించారు. 1942లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపు ఇస్తే దేశ ప్రజలందరూ ఆ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.  గాంధీజీ (Gandhiji) ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపు మేరకు ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. వాటి ప్రభుత్వాలను రద్దు చేసుకుని క్విట్ ఇండియా(Quit India) ఉద్యమంలో పాల్గొన్నాయని పేర్కొన్నారు.

    నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల (tribal Congress workers) రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో గురువారం (జులై 31) పాల్గొని మాట్లాడారు.

    READ ALSO  Vana Mahotsavam | నిజామాబాద్​ను గ్రీన్ సిటీగా మారుస్తాం

    బెంగాల్ ప్రెసిడెన్సీలో పాకిస్థాన్ కావాలని డిమాండ్ చేస్తున్న జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ తో వీర్ సావర్కర్, హిందూ మహాసభ (Hindu Mahasabha) ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి తొత్తులుగా మారి దేశానికి ద్రోహం చేశారన్నారు.

    ఆ ప్రభుత్వంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ (Shyam Prasad Mukherjee) కూడా ఉన్న మాట వాస్తవం కదా అని ప్రశ్నించారు. అటువంటి వీర్ సావర్కర్ దేశ ద్రోహి కాకుండా దేశ భక్తుడు అవుతుడా అని నిలదీశారు. అటువంటి చరిత్ర ఉన్న పార్టీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడటం విడ్డూరమని పేర్కొన్నారు.

    Anil Eravatri : దేశం కోసం కాంగ్రెస్​ నేతలు ఎంతో చేశారు..

    Anil Eravatri | బ్రిటీషర్ల తొత్తు..దేశ ద్రోహి వీర్​ సావర్కర్​ : ఈరవత్రి అనిల్​
    Anil Eravatri | బ్రిటీషర్ల తొత్తు..దేశ ద్రోహి వీర్​ సావర్కర్​ : ఈరవత్రి అనిల్​

    దేశం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో చేశారని అనిల్​ పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, లాలాలజపతి రాయ్ వంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేశారన్నారు.

    READ ALSO  Bheemgal | ఉద్యోగులకు బదిలీలు సహజం

    స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కష్టపడిందని ఈరవత్రి అనిల్​ చెప్పుకొచ్చారు. దేశంలో ఆదివాసీలకు, బంజారాలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ రక్షణ కల్పించిందన్నారు. పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.

    Latest articles

    Banakacherla | నారా లోకేష్ వ్యాఖ్యలపై స్పందించకపోవడం సరికాదు : వేముల ప్రశాంత్ రెడ్డి

    అక్షరటుడే, భీమ్​గల్: Banakacherla | తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం బనకచర్ల ప్రాజెక్టును (Bnakacherla) ఎలాగైనా కట్టి తీరుతామన్న...

    Today Gold Price | మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత త‌గ్గాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోతుండ‌టం సామాన్యుల‌కి మింగుడుప‌డ‌టం లేదు. శ్రావ‌ణ‌మాసంలో...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 2 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Nagpur | ధనవంతులే టార్గెట్​.. ఎనిమిది మందిని పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నించిన కిలేడీ అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ టార్గెట్​. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    More like this