United Poole Front
United Poole Front | రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్

అక్షరటుడే, కామారెడ్డి: United Poole Front | బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని యునైటెడ్ పూలే ఫ్రంట్​ రాష్ట్ర కో-కన్వీనర్, కార్మిక విభాగం ప్రతినిధి సల్వా చారి అన్నారు. పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) గురువారం చేపట్టనున్న 72 గంటల నిరాహార దీక్ష(Hunger strike) పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 4,5, 6, 7 తేదీలలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ (Indira park)​ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు.

బీసీ రిజర్వేషన్ (BC Reservation) అమలు అయ్యేంత వరకు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తూనే ఉంటారన్నారు. ఎమ్మెల్సీ కవిత వెంట జాగృతి సైనికులు (Telangana jagruthi) అండగా ఉంటూ ప్రతి ఉద్యమంలో పాలు పంచుకొని బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు, విష్ణుచారి, గణేష్ గౌడ్, కామారెడ్డి జిల్లా జాగృతి యువజన విభాగం జిల్లా నాయకులు జొన్నల వినోద్ కుమార్, జొన్నల రాము, రమేష్, చంద్రం, స్వామి,సంతోష్, హనుమంతరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.