ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​MAT Notification | ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్​.. మ్యాట్ నోటిఫికేషన్​ విడుదల

    MAT Notification | ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్​.. మ్యాట్ నోటిఫికేషన్​ విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MAT Notification | ఎంబీఏ (MBA) చదవాలనుకునే విద్యార్థుల కోసం మేనేజ్​మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) పరీక్ష షెడ్యూల్​ విడుదలైంది. సెప్టెంబర్ సీజన్ షెడ్యూల్​ను ఆల్ ఇండియా మేనేజ్​మెంట్ అసోసియేషన్ (AIMA) విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష రాయొచ్చు. ఢిగ్రీ ఫైనల్​ ఇయర్​ చదువుతున్న వారు కూడా అర్హులే. మ్యాట్​ ఫలితాల ఆధారంగా దేశంలోని 600 బిజినెస్​ స్కూళ్లు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ప్రవేశాల కోసం మ్యాట్ నిర్వహిస్తారు.

    MAT Notification | ఏటా నాలుగు సార్లు

    ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నాలుగు సార్లు మ్యాట్ పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్​లో పరీక్షలు ఉంటాయి. తాజాగా సెప్టెంబర్​ ఎగ్జామ్​కు సంబంధించిన నోటిఫికేషన్​ విడుదలైంది. ఒక్కసారి పరీక్ష రాస్తే వచ్చిన మార్కులకు ఏడాది పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

    READ ALSO  HDFC Bank Scholarship | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందా.. ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే!

    MAT Notification | పరీక్ష విధానం

    మ్యాట్​ పరీక్ష పేపర్​ బేస్​డ్ (PBT)​, కంప్యూటర్​ బేస్​డ్ (CBT)​ విధానాల్లో ఉంటుంది. అభ్యర్థులు ఏ విధానంలో అయినా పరీక్ష రాయొచ్చు. రెండు విధానాల్లో కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. పేపర్ బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్​కు రూ.2,200 ఫీజు చెల్లించాలి. రెండు రాసే అభ్యర్థులు రూ.3800 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది.

    MAT Notification | ముఖ్యమైన తేదీలు

    పేపర్ బేస్డ్ పరీక్ష కోసం సెప్టెంబర్ 15 లోపు రిజిస్టర్​ చేసుకోవాలి. సెప్టెంబర్​ 18న అడ్మిట్​ కార్డులు విడుదల చేస్తారు. అదే నెల 21న పరీక్ష ఉంటుంది.

    కంప్యూటర్ బేస్డ్ పరీక్షకు సెప్టెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. సెప్టెంబర్ 22న అడ్మిట్​ కార్డులు వస్తాయి. 28న పరీక్ష ఉంటుంది. అక్టోబర్​ నెలలో ఫలితాలు విడుదల చేస్తారు. ఇతర వివరాలకు mat.aima.in వెబ్​సైట్​ను సంప్రదించాలి.

    READ ALSO  EPFO Notifications | ఈపీఎఫ్‌వోలో అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

    Latest articles

    Green Field Express Way | తెలంగాణ‌లో ఆ జిల్లాల‌కి మ‌హ‌ర్ధ‌శ‌.. కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Green Field Express Way | తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త...

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ....

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains)...

    More like this