ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​TTD | మహిళలకు గుడ్​న్యూస్​.. ‘సౌభాగ్యం’ పంపిణీకి టీటీడీ ఏర్పాట్లు

    TTD | మహిళలకు గుడ్​న్యూస్​.. ‘సౌభాగ్యం’ పంపిణీకి టీటీడీ ఏర్పాట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామిని (Lord Venkateswara Swamy) నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటారు. టీటీడీ భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు టీటీడీ పలు ఆలయాలను, కల్యాణ మండపాలను నిర్మించింది. అంతేగాకుండా పలు ఆలయాలకు దూపదీప నైవేద్యం కోసం నిధులు కేటాయిస్తోంది. తాజాగా మహిళలకు టీటీడీ గుడ్​ న్యూస్​ చెప్పింది.

    వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratham) సందర్భంగా ఆగస్టు 8న మహిళలకు టీటీడీ, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా సౌభాగ్యం పేరిట గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం సౌభాగ్యం సామాగ్రికి శ్వేతా భవనంలోని హాల్​లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వారీగా పార్శల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు.

    READ ALSO  Leopard Attack | తిరుమలలో బైక్ ప్రయాణికులపై దాడికి ప్ర‌య‌త్నించిన చిరుత‌.. తృటిలో త‌ప్పించుకున్నారుగా..!

    TTD | 51 ఆలయాల్లో పంపిణీ

    ఏపీ, తెలంగాణలో టీటీడీ (TTD) 51 ఆలయాలను నిర్వహిస్తోంది. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలకు ఆయా ఆలయాల్లో సౌభాగ్యం పేరిట సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆయా ఆలయాలకు పంపేందుకు సౌభాగ్యం సామగ్రిని గురువారం సిద్ధం చేశారు. మహిళలకు గాజులు, పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, పద్మావతి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తకం అందించనున్నారు. సౌభాగ్యవతులకు వీటిని పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు వీటిని విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఎనిమిది లక్షల గాజులు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల కుంకుమ ప్యాకెట్లు, అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను ఆయా ఆలయాలకు తరలించారు. కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ సంచాలకులు శ్రీరామ్ రఘునాథ్, శ్రీ రాంగోపాల్, ఏఈవో శ్రీరాములు, సూపరింటెండెంట్ ఢిల్లీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    TTD | పలు కార్యక్రమాలు

    హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఆగస్టు 8న సౌభాగ్యం, ఆగస్టు 15న సన్మార్గం, ఆగస్టు 31న హరికథ వైభవం, అక్టోబర్ 2న మన వారసత్వం, 12న అక్షరగోవిందం, డిసెంబర్ 1న భగవద్గీతానుష్టానం (Bhagavad Gita Tanushtanam) కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

    Latest articles

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    Green Field Express Way | తెలంగాణ‌లో ఆ జిల్లాల‌కి మ‌హ‌ర్ధ‌శ‌.. కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Green Field Express Way | తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త...

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    More like this