Judo Selections
Judo Selections | జూడో రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జిల్లాపేరు నిలబెట్టాలి

అక్షరటుడే, ఇందూరు: Judo Selections | రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో జిల్లా పేరు నిలబెట్టాలని జిల్లా క్రీడా యువజన శాఖ అధికారి (District Sports and Youth Department Officer) పవన్ కుమార్ తెలిపారు.

జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్​లో (Subhash nagar) ఉన్న ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ (Government swimming pool) ఆవరణలో జిల్లాస్థాయి జూడో సబ్ జూనియర్ (Judo Sub Junior sports), కేడర్ ఎంపిక పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయా క్రీడాంశాల్లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు ఎందరో ఉన్నారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. కాగా ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు వరంగల్​లో (Waranagal) జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పీఈటీలు అనిత, శ్యామల, వికాస్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.