Collector Nizamabad
Collector Nizamabad | అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగరంలో ఆయా ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా పర్యటించారు. అమృత్​ 2.0 పథకంలో భాగంగా ఖానాపూర్ (Khanapur), కాలూర్​లో (kalur) జరుగుతున్న ట్యాంకుల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ట్యాంక్ నిర్మిస్తున్న ప్రాంతానికి ఆనుకొని ప్రభుత్వ పాఠశాల ఉన్నందున ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అవసరమైన సామాగ్రిని, సరిపడా సంఖ్యలో కూలీలను వినియోగిస్తూ నిర్విరామంగా పనులు జరిపించాలన్నారు. దుబ్బలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (Under ground drainage) పైప్​లైన్​ పనులు మందకొడిగా సాగుతుండడంతో కాంట్రాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు.

Collector Nizamabad | సమీకృత మార్కెట్​పై ఆరా..

నగరంలోని ఖలీల్​వాడి (Khaleelwadi), అహ్మదీ బజార్ (Ahmadi Bazaar) వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను కలెక్టర్ సందర్శించారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్​ను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గడువులోపు పనులు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. పాత గంజ్​లో ఆక్రమణలతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.

అనంతరం నాగారంలోని రాజీవ్ గృహ కల్ప (Rajeev Gruha Kalpa) సముదాయాలను పరిశీలించారు. లబ్ధిదారులకు వాటిని కేటాయించేలా మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఖానాపూర్ బస్తీ దవాఖానాను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్​వో డాక్టర్ రాజశ్రీ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రవిబాబు తదితరులున్నారు.