SP Rajesh Chandra
SP Rajesh Chandra | జిల్లాలో 30,30ఏ పోలీస్ యాక్ట్​ అమలు: ఎస్పీ రాజేష్​ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు(Rallies), పబ్లిక్ మీటింగులు (public meetings), సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.