Banswada MLA
Banswada MLA | పట్టణంలో డ్రెయినేజీలు శుభ్రంగా ఉండాలి.. ఎమ్మెల్యే పోచారం

అక్షరటుడే, బాన్సువాడ: Banswada MLA | మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో డ్రెయినేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో (municipal office) అధికారులు, వార్డు అధికారులతో గురువారం పారిశుధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో రోగాలు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మాజీ మున్సిపల్ ఛైర్మన్​ జంగం గంగాధర్, నాయకులు ఎజాజ్, అంజిరెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.