
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maya Sabha Trailer | వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోన్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్, మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌తో (Web Series) ముందుకొస్తోంది. ఇది ఏకకాలంలో రాజకీయాలు, స్నేహం, మానసిక సంఘర్షణల మధ్య సాగే కథతో రూపొందగా దీనికి ‘మయసభ – రైజ్ ఆఫ్ ది టైటన్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పొలిటికల్ డ్రామా సిరీస్‌కి దేవా కట్టా దర్శకత్వం(Director Deva Katta) వహించగా, విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నిర్మించారు. చిత్రంలో ఆది పినిశెట్టి – కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో, చైతన్య రావు – ఎం.ఎస్.రామిరెడ్డి పాత్రలో, దివ్యా దత్తా – ఐరావతి బసు పాత్రలో కనిపించనున్నారు.
Maya Sabha Trailer | ఆసక్తిరేపుతున్న ట్రైలర్..
ఇద్దరు అత్యంత సన్నిహితమైన స్నేహితులు.. ఒకే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెడతారు. ప్రజల కోసం, మార్పు కోసం కష్టపడతారు. కానీ రాజకీయ గమనం వారిద్దరిని రెండు వేర్వేరు దారులపై నడిపిస్తుంది. ఆగస్టు 7న ‘మయసభ’(Mayasabha) సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. కొద్దిసేపటి క్రితం విడుదలైన ట్రైలర్‌లో (Trailer) రాజకీయ పోరు, వ్యక్తిగత విభేదాలు, బలమైన డైలాగ్స్‌తో ఆకట్టుకునే విజువల్స్ కనిపించాయి. దేవా కట్టా మార్క్ స్క్రీన్‌ప్లే స్పష్టంగా కనిపించింది.
మయసభ రాజకీయ లబ్ధి కోసం స్నేహితులు శత్రువులుగా మారిన ఇద్దరు వ్యక్తుల కథ, అభిప్రాయ బేధాల మధ్య స్నేహం నిలబడేనా? వారిద్దరిలో ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తిగా నిలిచే అంశం. రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మంచి మిత్రులు. ఈ విషయాన్ని వారు పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే పాలిటిక్స్‌లోకి రాకముందు, వచ్చాక వారి జీవితాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే దానిని ఈ వెబ్ సిరీస్‌లో ఆసక్తికరంగా చూపించనున్నారు. మయ సభ వెబ్ సిరీస్‌లో సాయికుమార్, బాలీవుడ్ నటి దివ్య దత్తా, శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, శత్రూ, తన్య రామచంద్రన్ తదితరులు నటించారు.