అక్షరటుడే, వెబ్‌డెస్క్: War 2 Song | బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) కలిసి నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వార్ 2’ (War 2 Movie). ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్గా నటిస్తోంది. ఈ భారీ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ వరుస ప్రమోషనల్ అప్డేట్స్తో సందడి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో, ప్రమోషన్‌కు మళ్లీ జోష్ వచ్చింది.
War 2 Song | రొమాంటిక్‌గా..
తాజాగా.. చిత్ర బృందం విడుదల చేసిన ‘ఊపిరి ఊయలగా’ అనే రొమాంటిక్ మెలోడి సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హృతిక్ (Hrithik Roshan), కియారా జంట మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆహ్లాదంగా ఉండగా, విజువల్స్‌తో పాటే సంగీతం కూడా అందంగా ఆకట్టుకుంటోంది. తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా, శశ్వంత్ సింగ్ మరియు నిఖితా గాంధీ ఆలాపన మరో హైలైట్‌గా నిలిచింది. హిందీలో ఆర్జిత్ సింగ్ ఆలపించారు. అతని వాయిస్‌కు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిన ‘వార్ 2’ యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్‌లో సమతుల్యంగా ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
హృతిక్, ఎన్టీఆర్ కలిసి స్క్రీన్‌పై ఏ విధంగా దుమ్మురేపుతారో చూడాలంటే ఆగస్టు 14 వరకూ వేచి చూడాల్సిందే. వార్ 2 చిత్రానికి పోటీగా రజనీకాంత్ కూలి చిత్రం (Coolie Movie) విడుదల కానుంది. అందుకే రెండు చిత్రాలు పోటాపోటీగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద జరగనున్న ఈ బడా ఫైట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.